బ్రూస్ లీ జన్మదిన వేడుకలు...


మధురవాడ :  ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ యోధుడు, బ్రూస్ లీ 80 వ జన్మదిన వేడుకలు మధురవాడ శిల్పారామంలో బుధవారం ఘనంగా జరిగాయి. ఆనంద్ టైక్వాండో అండ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ముందుగా బ్రూస్ లీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మార్షల్ ఆర్ట్స్ కు ప్రపంచ ఖ్యాతి రావడానికి బ్రూస్ లీ పాత్ర ను టైక్వాండో ప్రధాన శిక్షకులు, రాష్ట్ర అమెచ్యూర్ టైక్వాండో సంఘ ఉపాధ్యక్షులు బి ఆనంద్ రావు క్రీడాకారులకు వివరించారు.
బ్రూస్ లీ 34 ఏళ్లకే తనువు చాలించినప్పటికీ మార్షల్ ఆర్ట్స్ లో చిరస్థాయిగా తన పేరు సజీవంగా ఉండేలా ఆయన పలు మార్గదర్శకాలు చూపారన్నారు.  యువ క్రీడాకారులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆనంద్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఈ యేడాది జిల్లా మొదలుకొని జాతీయస్థాయిలో రాణించి నా నా టైక్వాండో క్రీడాకారిని ఏ పూర్ణిమ లక్ష్మిని ఘనంగా సత్కరించారు. భీమిలి ఉత్సవాలలో నిర్వహించిన టైక్వాండో పోటీల విజయవంతానికి పూర్ణిమ లక్ష్మి కీలకంగా వ్యవహరించారని ఆనంద్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో టైక్వాండో కోచ్ లు బి జగదీష్, ఏ. పవన్ కుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా