ఫాష్... ఫ్లాష్ ... టి ఎస్ ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్... సిఎం కేసిఆర్
షరతుల్లేకుండా విదుల్లోకి కార్మికులు...
సమ్మెకాలంలో మృతిచెందిన కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం...
యూనియన్ల మాయలో పడవద్దు... ప్రభుత్వానికి సహకరించి.. ఆర్టీసీని లాభాలబాటలో నడిపించాలి...
హైదరాబద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె సుఖాంతం. అమాయక కార్మికుల సంక్షేమం దృష్టా అందర్ని విధుల్లోకి తీసుకుంటున్నాం అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఆర్టీసీని ఆదుకోవడంలో బాగంగా తక్షణ సాయం కింద 100 కోట్ల మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే ఆర్టీకి అదనంగా 750కోట్ల రూపాయలు సమకూర్చుకునేందుకు వీలుగా కిలోమీటరుకు 20పైసలు పెంచేందుకు అనుమతి ఇస్తున్నట్లు చేప్పారు. కేవలం యూనియన్ల మాయాజాలంమే సమ్మేగా అభివర్ణిస్తూ యునియన్లను దరిచేరనీయమని, కార్మికులు కూడా యూనియన్ల ఉన్నాదంలో పడి రోడ్డున పడవద్దంటూ హితవు పలికారు. అసంబద్ద డిమాండ్లు, అనాలోచిత సమ్మెతో కార్మికుల బతుకులతో యూనియన్ ఆటలాడుకుందని ఎద్దేవా చేశారు. ఎటువంటి షరతులు లేకుండా శుక్రవారం ఉదయం కార్మికులంతా విధుల్లో చేరవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండికి ఆదేశాలు జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికులు యూనియన్ల అభిప్రాయాలకు దూరంగా ఉండి తాను సూచించిన విదంగా ముందుకు సాగితే సింగరేణి కార్మికుల మాదిరి గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ లాభాలబాటలో నడిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్మికులతో తానే స్వయంగా కలిసి చర్చలు జరిపి నిర్ణయం తీసుకుందామంటూ సిఎం హామీ ఇచ్చారు. ఈమేరకు త్వరలోనే అన్ని డిపోలనుండి అయిదు మంది సీనియర్ కార్మికులతో తాను సమావేశం అయి ఆర్టీసీ నిర్వహణపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందామని స్పష్టం చేశారు. దీంతో గత 50 రోజులుగా తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె సుఖాంతం అయ్యింది. గత మూడు రోజులుగా తమను విధుల్లోకి తీసుకోవాలంటూ డిపోల చుట్టూ ఆర్టీసీ కార్మికులు కార్మికులు తిరుగుతన్న తరుణంలో సిఎం కేసిఆర్ సంచలన నిర్ణియం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పి వారిలో ఆత్మస్థైర్యం నింపారు. చివరి వరకు కార్మికులకు ఉద్యోగాలు ఉండవని, ఆర్టీసీ రూట్లను ప్రైవేటు పరం చేస్తున్నామంటూ ప్రకటలను రావడంతో ఏమి జరుగుతుందోనని ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఈవ్యవహారానికి తెరతీస్తూ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు సిఎం ప్రకటించడంతో కార్మికులు ఆనందోత్సవాల్లో మునిగారు. అలాగే సమ్మె కాలంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఆర్టీసీ, లేదా ప్రభుత్వంలో ఉద్యోగం ఇస్తామని సిఎం పేర్కాన్నారు.
Comments
Post a Comment