తెలంగాణా ఆర్టీసీ సమ్మెతో కార్మికులు ఏం సాధించారు? ప్రభుత్వ స్పందన ఎలా …
హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెతో కార్మికులకు ఒరిగిందేమీలేకపోగా ఉద్యోగ భత్రకే ముప్పు వాటిల్లడంతో ప్రభుత్వ దయాదాక్షణ్యాలే పరమావదిగా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందా? అంటే అవుననే పరిస్థితి కనిపిస్తోందిని చెప్పకతప్పదు. తెలంగాణా వ్యాప్తంగా ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం లక్ష్యంగా 47రోజులపాటు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. వీరికి అఖిలపక్షం అండగా నిలిచింది. అయినప్పటికీ సమ్మె లక్ష్యం మాటెలా ఉన్నా సమ్మెకు పూర్వం ఉన్న పరిస్థితిలోనైనా ఉద్యోగం కొనసాగింపుకోసం కార్మికులు డిపోలచుట్టూ తిరగడం విచారకరం. ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగంలో చేరతామంటూ కార్మికులు డిపోల చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. పైగా ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు తాము ఎవరినీ విధేల్లోకి చేర్చుకునే వీలులేదంటూ తెగేసిచెప్పడంతో కార్మికులు నిరాశతో వెనుదిరగుతున్నారు. భవిష్యత్ కార్యక్రమం పై మల్లగుల్లాలు పడుతున్నారు. సమ్మె కాలంలో ప్రభుత్వానికి కార్మికులకు పలుదఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడం, ఇరువర్గాలు ఎవరి పంతం వారు నెగ్గించుకునే దిశగా పావులు కదుపుతూ కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ కార్మికులు ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలతో కూడి ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆర్టీసీ యాజమాన్యం ఆరోపించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విలీనం సాధ్యం కాదని పేర్కొంది. ఈనేపథ్యంలో కార్మిసంఘం సమ్మె పై ఓమెట్టుదిగి విలీనం డింమాండ్ విరమించుకొని మిగిలిన షరతులు పరిష్కరించాలని కోరింది. అయినా స్పందన లేకపోగా ఉద్యోగ భద్రతకే ముప్పువాటిల్లే ప్రమాదం ఏర్పడడంతో కనీసం సమ్మెకాలానికి జీతభత్యాలు చెల్లించాలని కోరారు. దీనికి కూడా ఫలితం లేకపోవడంతో చేసేది లేక తొలుత ఉద్యోగాలైనా కొనసాగించుకోవలని నిర్ణయించారు. దీనికి కూడా ఇప్పుడు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తెలంగాణా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపైనే ఆదారపడాలే అనే పరిస్థితి నెలకొందా? అనే అనుమానాలు ఎదురౌతున్నాయి. ముఖ్యమంత్రి ఏమేరకు ఆర్టీసీ కార్మికుల పట్ల తుది నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే…
Comments
Post a Comment