ఏజెన్సీ లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్...
సబ్ కలెక్టర్ డాక్టర్. వెంకటేశ్వర్ ..
పాడేరు (జనహృదయం): ఏజెన్సీ లో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపడతామని సబ్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల పై సమావేశం నిర్వహించారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోని పోలింగ్ కేంద్ర విభజన ప్రక్రియ చేపడతామన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని రాజకీయ నాయకులు సూచించారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో 1200 ఓట్లు కంటే ఎక్కువ ఉంటే మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని సబ్ కలెక్టర్ చెప్పారు. చనిపోయిన వారి పేర్లు తొలగించడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మణికుమారి ,బొర్రా నాగరాజు, ఆడపా బజ్జు నాయుడు ,కురుస ఉమామహేశ్వరరావు, భగత్ రాం, మోరి రవి , ధనలక్ష్మి, గంజాయి ధనలక్ష్మి ,తులసి రావు ,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment