మహాకూటమిదే అంతిమవిజయం..
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆదేశం
ముంబై: మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ రాజీనామా అనంతరం.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకుని బుధవారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గవర్నర్ ఆదేశాల మేరకు బుధవారమే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షను నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ బలపరీక్ష చేపట్టేందుకు గవర్నర్ చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ ప్రొటెం స్వీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ శాసనసభ్యుడు కాళిదాస్ కోలంబకర్‌ను నియమించారు. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని సభలో సీనియర్ సభ్యుడైన ఎమ్మెల్యేను ప్రొటెం స్వీకర్ గా ఎన్నుకోవాలి బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నేతృత్వలోని సభ్యులచే ఆయన ప్రమాణ స్వీకారం చేయించి, బలపరీక్షను ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సిద్ధమయింది. కూటమి నేతగా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకునేందుకు మూడు పార్టీల నేతలంతా సమావేశం అయ్యారు.
Comments
Post a Comment