పుట్టినరోజు నాడే...


వరంగల్ :  హన్మకొండలో  దారుణ  సంఘటన చోటుచేసుకొంది  పుట్టినరోజు నాడే అనుమానాస్పద మరణం ఆ కుటుంబాన్ని  తీవ్ర విషాదాన్ని మిగిలిచింది .   హంటర్ రోడ్డు సమీపంలో బుధవారం రాత్రి స్థానికులు కొందరు బాలిక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులు  కేసు నమోదు చేశారు.  అనంతరం  బాలిక తల్లిదండ్రుల  వివరాలు సేకరించి  విచారణ చేపట్టారు.


దీనదయాళ్‌నగర్‌లో నివాసం ఉండే మానస బుధవారం తన పుట్టిన రోజు కావడంతో గుడికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. ఫోన్ మధ్యాహ్నం నుంచి స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం  కుటుంబ సభ్యులు బుధవారం  రాత్రి పోలీసులకు పిర్యడుచేశారు.   ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
కూతురిని ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. పుట్టినరోజు నాడే కూతురు ఇలా విగతజీవిగా పడి ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఘటనా స్థలానికి కొద్ది దూరంలో బీరు సీసాలు, అమ్మాయి చెప్పులు లభించాయి. మానసను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే యువతి స్నేహితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నారు. మానస ఎప్పుడు కలిసింది.. ఎక్కడెక్కడికి వెళ్లింది ఆరా తీస్తున్నారు.  ఘటన జరిగిన ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉండటంతో స్ట్రీట్ లైట్లు కూడా లేవు. దీంతో అక్కడ చీకటిగా ఉంటుంది.. యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇది ఆమెకు తెలిసిన వారి పనేనా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా