గంగపుత్రుల బతుకుల్లో వెలుగులు … సి ఎం జనన్‌ వెల్లడి



ముమ్మిడివరం (జనహృదయం) : మత్యకారులకు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభించిన మత్యకారుల భరోసా కార్యక్రమంలో బాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంకల్ప యాత్రలో మత్యకారులకు ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్నానని గుర్తు చేశారు. మత్య కారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మత్య కారుల జీవితాల్లో వెలుగులు నింపేదిశగా సంక్షేమ కార్యక్రమాలు రూపాందిచామని మత్యకార భరోసా ద్వారా వారికి సేవలు అందిస్తామన్నారు. మత్యకారులు సముద్రంలో వేటనిషేద సమయంలో కుటుంబానికి రూ.10 వేల వంతున ప్రభుత్వం చెల్లిస్తుందని, వేట సమయంలో మత్యకారులు ప్రమాదవసాత్తు మరణిస్తే రూ.10 లక్షలు అందిస్తామని అన్నారు. మత్యకారులకు డీజిల్‌పై రూ.9 రాయితీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.




ప్రపంచ మత్యకార దినోత్సవాన మత్యకాత భరోసా ప్రారంభం ఆనందంగా ఉందన్నారు. బడ్డెట్‌లో మత్యకారులకు రూ.551కోట్లు కేటాయించామన్నారు. గంగపుత్రులకు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే నెరవేర్సున్నానని తానిచ్చిన హామీలన్నీ దశలవారీగా నెరవేరుస్తానని ఆనాడు పరిస్థితులు చూసి గుండె తరుక్కుపోయిందని ఈదిశగా అన్ని వర్గాల వారికి అండగా ఉండే విదంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపిస్తానని సిఎం జగన్‌ హామీ ఇచ్చారు. అనంతరం పశువుల్లంక-సలాదిపాలెం వద్ద 35కోట్లతో నిర్మించిన వైఎస్‌ఆర్‌ వంతెన ప్రారంభించారు.



Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా