అందరికీ అందుబాటులో ఇసుక ...
భీమిలి (జనహృదయం): పూర్తి స్థాయిలో ఇసుక సరఫరా కోసం చర్యలు చేపదుతున్నామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. భీమునిపట్నం , కృష్ణా కాలనీ సమీపంలో శుక్రవారం ఇసుకర్యాంప్ ప్రారంభించిన అనతరం మాట్లాడుతూ ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని అన్నారు. విశాఖ జిల్లాలో ఇప్పటికే 8 ర్యాంప్ లు ప్రారంభించామన్నారు.
నర్సీపట్నం , నక్కపల్లి, అనకాపల్లి, అగనంపూడి, చోడవరం, ముడసర్ర్లోవ , అచ్యుతాపురం, భీమిలీలో ఏర్పాటు చేసి అందరికి పూర్తి స్థాయిలో ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ప్రతి ఇసుక ర్యాంప్ దగ్గర ఇసుక ధరను తెలిపే బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జె.సి ఎల్.శివశంకర్
మాట్లాడుతూ భీమిలిలో ప్రారంభించిన ఈ ఇసుక ర్యాంప్ లో ఉన్న ఇసుకను సరఫరా చేయడానికి ఒక టీమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారి ద్వారా ఎటువంటి అవకతవకలు లేకుండా అందరికీ ఇసుకను సరఫరా చేస్తామని అన్నారు. అలాగే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ .కిషోర్, భీమిలీ తహసీల్దార్ వెంకట ఈశ్వరరావు, జోనల్ కమిషనర్ గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment