ఘనంగా కార్తీక సమారాధన... తూ . గో . జిల్లాలో


కాకినాడ (జనహృదయం) : తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ధన్వంతరి పూజ తో కార్యక్రమాన్ని మొదలు పెట్టిన ఈ కార్యక్రమానికి తూ.గో. జిల్లా నాయీబ్రాహ్మణ సంఘం ప్రధానకార్యదర్శి  సుందరపల్లి గోపాలక ష్ణ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్‌ మున్సిపల్‌ నగర మేయర్‌ సుంకర పావని తిరుమల కుమార్‌ తుమ్మిడి రామ్‌ కుమార్‌ 93 బీసీ కులాల రాష్ట్ర అధ్యక్షులు మాకిరేడ్డి భాస్కర్‌ గణేష్‌ బాబు తూర్పుగోదావరి జిల్లా యాదవ మహాసభ అధ్యక్షులు కుండల సాయి కుమార్‌ యాదవ్‌ తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వర జనసేన పార్టీ నాయకులు జ్యోతుల వెంకటేశ్వరరావు హాజరైనారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ సభ్యులంతా ఐకమత్యంతో మెలిగి సంఘ అభివృద్దికి తోడ్పాటు అందించుకోవాలని, సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన చిరంజీవి మహాలక్ష్మి తణుకు వారి భరతనాట్యం ఆహూతు లందరినీ ఉర్రూతలూగించింది. కాకినాడ ఎంపి వంగా గీతా విశ్వనాధ్‌ చిరంజీవి మహాలక్ష్మి ని ఇంటర్మీడియట్‌ విద్య చదివిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలి బుద్ధప్రసాద,్‌ తుమ్మిడి రామ్‌ కుమార్‌ తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నామని, మహాలక్ష్మికి కాకినాడలో తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అవార్డును అందించేందుకు కృషిచేస్తామని తుమ్మిడి రామ్‌ కుమార్‌ చిరంజీవి మహాలక్ష్మి ని అభినందించడం జరిగింది ఆటపాటలతో నాయి బ్రాహ్మణ సోదరులు సోదరీమణులు బాల బాలికలు ఎంతో ఆనందంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఆదినారాయణ సుందరపల్లి గోపాలక ష్ణగారుద్రాక్షారపు వెంకట్రావు, జి తాతారావు పి సత్యనారాయణ టి విజయ్‌ డి పాపారావు యన్‌ పాపారావు రామవరపు బాబురావు సుందరపల్లి బాబురావు గారు డి రామ్మోహన్‌ రావు మొదలగువారు పాల్గొనడం జరిగింది ఆటలలో విజయం సాధించిన విజేతలకు సత్యప్రసాద్‌ గారు రిటైర్డ్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్స్పెక్టర్‌ వారిచే మెమెంటోలు, దృవపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన నాయీబ్రాహ్మణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా