దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం .. మంత్రి వనిత


విజయవాడ (జనహృదయం):   రాష్ట్రంలో దివ్యంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మహిళ మరియు శిశు దివ్యాంగుల వయోవృద్ద్దుల సంక్షేమ శాఖ మాత్యులు తానేటి వనిత పేర్కొన్నారు.  విజయవాడ లోగల బసవ పున్నయ్య కన్వెన్షన్ హాల్ లో డిసెంబర్ 3 న జరగనున్న  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం లో బాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో దివ్యాంగులకు మంచిరోజులు రానున్నాయని,. ప్రస్తుతం వాళ్లకు అందుతున్న పేంక్షన్ ను ఇంకా పెంచే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  అయిదు  నెలల్లోనే 4లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని అందులో దివ్యంగుల 3 నుంచి 4 శాతం వరకు రిజర్వేషన్లు గవర్నమెంట్ తరపునుంచి కల్పించామని తెలిపారు.  వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016 సెక్టన్ 72 ప్రకారం జిల్లాలో కమిటి లు ఏర్పాటుచేస్తామని
చైర్మన్ గా కలెక్టర్ మెబెర్స్ గా ఎస్పి , డిఆర్దియే పిడి ,ఏడి డిసేబుల్ ,ఎస్ ఎస్ ఎ పి ఓ,సిఎఒ ,  జిల్లా వైద్య ఆరోగ్యాధికారితో పాటు ఒక దివ్యంగుల సభ్యులు ఉంటారని చెప్పారు.


ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించి  వికలాంగుల జాతీయ హక్కుల సమితి అధ్యక్షుడు బందెల కిరణ్ రాజు నిర్వహించిన  ముందస్తు సంబరాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈసంధర్బంగా పలువురు దివ్యన్గులను సత్కరించారు .
 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా