కొత్తపల్లి జలపాతం లో పర్యాటకుల సందడి
జి మాడుగుల (జనహృదయం) : విశాఖ జిల్లాలోని జి మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం నిత్యం ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులతో కళకళ లాడుతోంది. కార్తీకమాసం చివరి వారం కావడంతో ముడురోజులు శని.అది సోమవారం లలో సుమారు 20వేలమంది వరకు పర్యాటకులు ఈ జలపాతాన్ని సందర్శించారు. ఆంధ్ర ఒడిశా తెలంగాణ రాష్ట్రలతో పాటు ఇతరప్రాంతాలనుంచి పర్యాటకులు వచ్చి ఇక్కడ సందడి చేశారు. చాలామంది బస్సులు కారులు జీవులు వ్యాన్లు . ద్వి చక్ర వాహనాలు మీద వచ్చి వంటలుచేసుకొని కార్తీకవనబోజనాలు చేసి చెట్లకింద బసచేసిఉల్లాసంగా గడిపారు. జలపాతంలో నీళ్లు చలి తో వణికిస్తున్నప్పటికి చలిని ఖాతరు చేయకుండ చిన్నపిల్లలు పెద్దలు అనే భేదాలు లేకుండా ఉల్లాసంగా జలకాలాడారు. జలపాతం అందాలు చూడచక్కగా ఉన్న కనీస సదుపాయాలు మరుగుదొడ్లు. బట్టలు మార్చుకోవడానికి గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాలనుంచి వచ్చిన పర్యాటకులకు ఆహార పదార్థాలు దొరక్క ఇబ్బందులు పడ్డారు . భారీస్థాయిలో పర్యాటకులు వస్తున్నారు కావున ప్రభుత్వం చొరవచూపించి కొత్తపల్లి జలపాతంలో సౌక్యరాలు కల్పించి పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పర్యాటకులుకోరుతున్నారు.
Comments
Post a Comment