కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఉచితం..
విజయవాడ : కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటుకు అదనపు రుసుము చెల్లించనవసరంలేదని, వాహన ధరలొనే కలిపి ఉంటుందని డిటీసీ ఎస్ వేంకటేశ్వరరావు తెలిపారు. కొత్త వాహనాలు కొనుగోలు సమయంలోనే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను వాహనయజమానులకు తయారీదారులు లేదా వాహనడీలర్ ద్వారా ఇప్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను వాహన యజమానులకు ఇచ్చే దానిలో ఎటువంటి ఉల్లంఘనలు జరగకుండా చూడాలని, వాహన డీలర్లకు ఈ మేరకు ఆదేశాలను జారీచేశారు.
Comments
Post a Comment