సుప్రీం కు చేరిన మహా వివాదం .... రేపటికి వాయిదా..


రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వ ఏర్పాటు జరింగందంటూ కోర్టును ఆశ్రయించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రేస్‌


మహా విదాదం పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం..


రేపు ఉదయం 10.30గంటల లోపు గవర్నర్‌ ఆహ్వానపత్రం, ఎమ్మెల్యేల మద్దతు లేఖలు సమర్పించాలి... సుప్రీం


మహారాష్ట్ర సిఎం, డిప్యూటీ సిఎం తోపాటు కేంద్రానికి సుప్రీం నోటీసులు...


గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్దమా?...


ఆదివారం పడ్నవీస్‌సాడే బలపరీక్షకు ఆదేశించాలని కోర్టును కోరిన న్యావయాది కపిల్‌సిబాల్‌...


డిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో గవర్నర్‌ వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్దంగా ఉందని అత్యున్నత న్యాయస్థానాన్ని శివసేన ఆశ్రయించింది.  శనివారం ఉదయం మహారాష్ట్రలో బిజేపి అభ్యర్ది దేవేంద్ర పడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా ప్రయాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటులో రాత్రికి రాత్రే ఊహించని పరిణామాలు ఉత్పన్నమై శనివారం ఉదయానికి రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం, దేవేంద్ర పడ్నాయక్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేయడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన పార్టీలకు ఊహించని షాక్‌ తగిలినట్లయింది. దీంతో ఈవ్యవహారంలో గవర్నర్‌ తీరును తప్పుబడుతూ సుంప్రీకోర్టును వారు ఆశ్రయించారు.


ఈ వ్యమహారంపై ప్రాథమికంగా విచారణ జరిపిన సుంప్రీంకోర్టు గవర్నర్‌ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించారని అభిప్రాయపడింది. అయితే మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో అధికారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. సోమవారం ఉదయం 10.30గం. ఎమ్మేల్యేలు సమర్పించిన మద్దతు లేఖలు, రాష్రపతి పాలన ఎతివేసిన సమయం తదితర వివరాలు అన్నింటినీ కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. సొలిసిటర్‌ జనరల్‌ లేఖలు సమర్పించిన తర్వాతనే బలపరీక్ష నిర్ణయం చేయాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్రంతోపాటు ముఖ్యమంత్రి పడ్నవీస్‌, ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు ఈమేరకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో జస్టిస్‌ ఎల్వి రమణ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం గంటసేపు విచారణ జరిపింది. బిజేపి తరుపున న్యాయవాది ముకుల్‌ రోహిత్‌ తన వాదనలో గవర్నర్‌కు రాజ్యాంగంలో సంక్రమించిన విచక్షణాధికారాలను తప్పుబట్టే అవకాశంలేనందున కోర్టు ఈపిటిషన్‌ తిరస్కరించాలని కోరగా, శివసేన తరపున వాదన వినిపించిన న్యాయవాది కపిల్‌ సిబాల్‌ మహారాష్ట్రలో ఏర్పడిన పడ్నవీస్‌ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా ఏర్పడిందని దీనికి మద్దతుగా గవర్నర్‌ ఏకపక్షంగా వ్యవహిరంచారంటూ వాదన వినిపించారు. దీంతో సోమవారం ఉదయానికి విచారణను వాయిదా వేశారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా