ఎవర్నీ ఇబ్బంది పెట్టడం మా లక్ష్యం కాదు..


జర్నలిస్ట్‌ ల వినతి పత్రానికి స్పందించిన మంత్రి పేర్ని నాని....


వారం రోజుల్లో అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సమాచార శాఖకు ఆదేశం..


విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రివర్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) గారితో జరిపిన చర్చల్లో ఎపిజెఎఫ్‌యూనియన్‌ అందించిన వినతి కి మంత్రివర్యులు సానుకూలంగా స్పందించారు వారం రోజుల్లో రాష్ట్రంలో ఉన్న యూనియన్‌ నాయకుల చే సమావేశం ఏర్పాటు చేయాలని ఐ ఎన్‌ పిఆర్‌ కమిషనర్‌ కు సూచించారు.


జీవో నెంబర్‌ 142 ద్వారా జిఎస్టి మినహాయింపు కోరుతూ చిన్న పత్రికల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని దాని ద్వారా చిన్న పత్రికలో పనిచేస్తున్న 95 శాతం మంది పత్రిక జర్నలిస్టులకు అక్రిడేషన్‌ అందించలేని పరిస్థితి ఏర్పడుతుందని జర్నలిస్టులు మంత్రి ద ష్టికి తీసుకెళ్లారు.


దీనిపై వెంటనే స్పందించిన సమాచార శాఖ మాత్యులు ఐ ఎన్‌ పి ఆర్‌ కమిషనర్‌ తో వెంటనే చర్చలు జరిపారు అక్రిడేషన్‌ అందించేందుకు అతి తక్కువ సమయం ఉన్నందున త్వరగా ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం యూనియన్ల ద్వారా జరపాలని సూచించారు మంత్రి నాని మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు తమ ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన ఉండదని అన్నారు పాలనలో పారదర్శకత ఎలా ఉందో అక్రిడేషన్‌ అందించడంలో కూడా పారదర్శకతతో అందిస్తామని తెలిపారు కొత్త నిబంధన ద్వారా ఎవర్నీ ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదని అక్రమ అక్రిడేషన్‌ మంజూరు దారులను ఏరివేత కార్యక్రమం చేపడతామని అన్నారు త్వరలో జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత చిన్న పత్రికల యాజమాన్యాల కు న్యాయం చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా