నిర్వాసితుల గోడు పట్టదా...

 


ఎటపాక (జనహృదయం): పోలవవరం నిర్మాసితుల గోడు పట్టించుకోవాలంటూ ఆంధోళన వ్యక్తం అవుతోంది. విలీన మండలాలకు చెందిన పోలవరం నిర్వాసితులు ఆదివారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామం లో ఈ మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నిర్వాసితులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికిన నిర్మిస్తున్నారే తప్ప విలీన మండలాలైన ఎటపాక, కూనవరం, విఆర్‌ పురం, చింతూరు మండలాల నిర్వాసిత ప్రజల గోడు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిర్వాసితుల సమాధుల పై పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ప్రభుత్వాలు విష్మరించకూడదని గుర్తు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే విలీన మండలాలు జల సమాధి అవుతుందని అన్నారు. విలీన మండలాల నిర్వాసితులందరికి 2013 చట్ట ప్రకారం ప్యాకేజి, పునరావాసం కల్పించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 2006 లో భూ పరిహారం తీసుకున్న నిర్వాసిత రైతులందరికీ ఎకరాకు రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో దొంతు మంగేశ్వరవు,కందుకూరి మంగరాజు, బొల్లా నర్సింహారావు, దుద్దుకురి హరినాధ్‌, పుసం రాఘవయ్య, కడియం రమాచారి పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా