తూ .గో . జిల్లాలో పర్యటించనున్న సిం జగన్
కాకినాడ (జనహృదయం): ప్రజాసంకల్పయాత్ర హామీలకు ముఖ్యమంత్రి జగన్ కార్యరూపం దాల్చనున్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారు తాను ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర లో మత్స్యకారులకు పలు హామీలు ఇచ్చారు వాటి అమలుకు సీఎం గురువారం శ్రీకారం చుట్టనున్నారు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యకలాపాల్లో జీవన ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఆ సంస్థ ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులో జాప్యం జరగడంతో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఇస్తామని వాగ్దానం చేశారు ఈ మేరకు 78.22 కోట్లు మత్స్యకారులకు అందజేయనున్నారు. ముమ్మడివరం లో డిగ్రీ కళాశాల నిర్మాణానికి ఎదురులంక, ఎస్సీ లంక. భూముల్లో 75 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. గురువారం ఉదయం పది గంటల సమయంలో జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో ముమ్మిడివరం మండలం గాడిలంక చేరుకొని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు
Comments
Post a Comment