అన్యమత ప్రచార బోర్డులతో రావద్దు...

 


సింహాచలం (జన హృదయం) :  సింహగిరిపై భక్తులను తరలిస్తున్న సింహాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుల పై అన్యమత ప్రచారాన్ని సంబంధించిన స్టిక్కర్లు ఉండడాన్ని దేవస్థానం ట్రాన్స్ పోర్ట్ సూపరింటెండెంట్ ముద్దాడ వెంకట రమణ గమనించి ఆ బస్సులను నిలిపివేశారు బస్సు డ్రైవర్ కండక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.  అన్యమత ప్రచారం బోర్డులు కలిగిన సిటీ బస్సులను సింహగిరిపై నడపడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలియ చేశారు ఈ విషయాన్ని వెంకటరమణ ఆలయ ఈవో వెంకటేశ్వరరావు కు తెలియజేశారు బస్సులో ఉన్న ప్రయాణికులు దించి వేసి ఆ బస్సులను ఖాళీగా దిగువకు వెంకటరమణ పంపించివేశారు సింహగిరిపై వచ్చే బస్సులపై హిందూ మత ప్రచారం తప్ప అన్యమత ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని అటువంటి బస్సు తీసుకురావద్దని ఆర్టీసీ ఉద్యోగులకు వెంకటరమణ హెచ్చరించారు. ఈ సంఘటనపై సింహాచలం డిపో మేనేజర్ స్పందిస్తూ  అన్యమత ప్రచారం చేస్తున్న బోర్డులు ఉన్న బస్సుల ను కొండమీదకు పంపకుండా తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా