వాల్తేరు డివిజన్ యధావిధిగా కొనసాగించాలి : ఎంపి విజయసాయిరెడ్డి



 

న్యూఢిల్లీ (జన హృదయం): వాల్తేరు డివిజన్ యధావిధిగా కొనసాగించాలని వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న వాల్తేరు డివిజన్ కు 125 ఏళ్ల చరిత్ర ఉందని అటువంటి డివిజన్ ను రద్దు చేయడం రైల్వే చరిత్రలోనే ఎక్కడా జరగలేదని దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఆవేదన చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో భాగమైన వాల్తేరు డివిజన్ భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న డివిజన్లలో ఐదో స్థానంలో ఉందని అన్నారు. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్, నార్త్ ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే జోన్ ల ఉమ్మడి ఆదాయం కంటే కూడా వాల్తేరు డివిజన్ ఆదాయం అధికంగా ఉందన్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే లో వాల్తేరు డివిజన్ ఆదాయం తూర్పు తీర రైల్వే లోని మూడవ అత్యధిక ఆదాయ వనరుగా ఉందన్నారు. గణనీయంగా ఎదుగుతున్న వాల్తేరు రైల్వే డివిజన్ ను బలోపేతం చేయాల్సింది పోయి రద్దు చేసి విజయవాడ డివిజన్ పరిధిలోకి విలీనం చేసే విధానానికి స్వస్తి పలకాలన్నారు. దీనివలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్ ను విలీనం చేయాలన్న ఆలోచన రైల్వే నిర్వహణ విపత్తు యాజమాన్యానికి సంబంధించి అనేక సమస్యలకు దారితీస్తుందని ప్రమాదాల సమయంలో త్వరగా స్పందించే అవకాశం తగ్గిపోతుందని, ప్రయాణికుల భద్రత, రైల్వే నిర్వహణ వంటి సున్నితమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని వాల్తేరు డివిజన్ కొనసాగించాలని కోరారు.



Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా