ప్రపంచంలో గుర్తింపుకు ఆంగ్లం అవసరం..
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ
విశాఖపట్నం( జనహృదయం): ఆంగ్ల మాధ్యమంతో ప్రపంచంలో గుర్తింపు సాధ్యమవుతుందిని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. గురువారం సర్క్యూట్ హౌస్ లో మాట్లాడుతూ తమ కమిషన్ ఇప్పటి వరకు 14 వేల వినతులను స్వీకరించగా వాటిలో 12 వేలు పరిష్కరించామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాలపై తక్షణం స్పందిస్తున్నా మని, బాధితులకు వేగంగా న్యాయం అందేలా చూస్తున్నట్లు చెప్పారు. కుల వివక్షతను కూకటివేళ్ళతో పెకలించి వేసేందుకు అన్ని చర్యలను చేపడుతున్నట్లు తెలిపారు. 13 జిల్లాలలో సమీక్షలు నిర్వహించామని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధుల ఖర్చును, వసతిగృహాల నివేదికలను పరిశీలించాము అన్నారు. ఎస్సీ ఎస్టీలకు కొన్ని గ్రామాలలో స్మశాన భూమి లేదని ప్రభుత్వం ఆయా గ్రామాలకు స్మశాన భూమిని కేటాయించ వలసిందిగా నివేదికలు పంపినట్లు తెలిపారు. ఎస్సీ ఎస్ టి లవారంతా వ్యవసాయ ప్రాధాన్యతగా జీవనం సాగిస్తున్న నందున ప్రభుత్వ రుణంతో భూములను కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు చెందిన 14 లక్షల ఎకరాలు ప్రభుత్వం మంజూరు చేసిన భూములు ఉండేవని వాటిలో 9 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని వాటిని తిరిగి ఇప్పించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్సీ ఎస్టీ లకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చారు. వీటిలో ఎక్కువగా గాజువాక ప్రాంతం లోని ఎస్సీ ఎస్టీల భూ సమస్యలు ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించి సొంత దారులకు భూములు ఇప్పించాలని, ఎవరైనా ఎదురు తిరిగినట్లు అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులను అమలు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ డి ఓ పెంచల కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయ ప్రకాష్, పోలీసు అధికారులు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పారిపిల్లి రామారావు, రాష్ట్ర ఎస్సీ మహిళ అధ్యక్షురాలు భూలక్ష్మి, విజిలెన్స్ మానిటరీ మెంబర్ ఏ తలపాక సుజాత , తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment