పిఎసేల్వి సి 47 ప్రయోగం సక్సెస్....


శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్‌వీ సీ 47 ప్రయోగం విజయ వంతమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగాన్ని ఉదయం 9.28 గంటలకు చేపట్టారు. అనంతరం వివిధ దశల్లో 26.50 నిమిషాల వ్యవధిలో 14 - ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. నిర్దేశిత కక్ష్యలోకి ఒక్కొక్కటిగా ఉపగ్రహాలు చేరాయి. పీఎస్ఎల్‌వీ సంకేతాలను అంటార్కి టకలోని ఇస్రో కేంద్రం అందుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్సీ47 ప్రయోగానికి మంగళ వారం ఉదయం 7.28 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ప్రక్రియ 26 గంటల పాటు సాగింది.  ఈ ప్రయోగం ద్వారా కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన 13 నానో పాటు అమెరికాకు చెందిన 13 నానో ఉపగ్రహాలను నింగిలోకి పంపారు.. మూడోతరం హైరిజల్యూషన్ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహం కార్టోశాట్-3. దీని జీవిత కాలం ఐదేళ్లని,  దీని బరువు సుమారు 1625 కిలోలు. పట్టణాభివృద్ధి ప్రణాళిక, గ్రామీణ వనరులకు సంబంధించిన సేవలను ఇది అందించనుంది. ఉగ్రవాద శిబిరాలను కార్టోశాట్-3 మరింత స్పష్టంగా తీయనుంది. ఈ  ప్రయోగం విజయంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్ శివన్ మాట్లాడుతూ  ఈ అద్భుత ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి వరకు 13 మిషన్లు ఉన్నాయని.. తమకు ఇప్పుడు చేతి నిండా పని ఉందని పేర్కొన్నారు. సందర్భానికి తగినట్లుగా సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా