జీఓ 142 సవరించి అక్రిడేషన్లు ఇవ్వాలి ...


విశాఖపట్నం  : జర్నలిస్టుల అక్రిడేషన్ ల జీవో నెంబర్ 142 న సవరించి అర్హత కల్గిన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ లు జారీ చేయాలని కోరుతూ లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి పంపించే నిమిత్తం సోమవారం స్పందన కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శివ శంకర్ కువినతి పత్రాన్ని అందజేశారు. ఈ జీవో వల్ల జర్నలిస్టులు వారి హక్కులను కోల్పోతున్నారని, స్థానిక పత్రికలు మూతపడే అవకాశం ఉందని ఆయనకు తెలిపారు . జీవోలో జిఎస్టి నిబంధనను రద్దు చేయాలని, స్థానిక దినపత్రికలకు తగిన అక్రిడేషన్లలు జారీ చేయాలని , ఎంపానెల్ మెంట్ లేని దినపత్రికలకు అక్రిడేషన్ లు ఇవ్వాలని, పిరియాడికల్స్ కు , పేజీలు తగ్గించాలని తది తర డిమాండ్లతో వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మీరు అందజేసిన పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తెలిపారు .స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కు కలిసిన వారిలో లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ కార్యదర్శ ధవలేశ్వరపు రవికుమార్ బి.శివ ప్రసాద్, అబ్బాస్,ఎస్. సన్యాసిరావు , వెంకట వేణు చక్రి ,మెట్ట కృష్ణారావు, పరశురాం, దుంపల ప్రసాదరావు , కోటేశ్వరరావు, శ్రీహరి , రామ్మోహన్ రావు, భగవాన్, సాగర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా