తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తేవాలి.... మంత్రి వనిత

 


రాజమహేంద్రవరం (జనహృదయం):  తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు కృషి చేయాలని శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు.  జూనియర్ కాలేజీలో జరిగిన  46 వ వార్షికోత్సవానికి హాజరయిన సంధర్భంగా మాట్లాడుతూ    పిల్లలు అందరూ తల్లిదండ్రులను గౌరవించాలని ప్రతి ఒక్కరితో మర్యాదగా ఉంటూ బాగా చదువుకుంటూ తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు పెంచాలన్నారు.  ఇంటర్ చదివే విద్యార్థులు ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉండాలని టీనేజ్  ఆలోచనాలలోనే మీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుందని అన్నారు.


ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఎక్కువ వాడుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు,ఈ సైబర్ ప్రపంచం లో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇంటర్నెట్ తో జాగ్రత్త పాటించాలన్నారు.  ఏ ఆటంకం వచ్చిన,సమస్య వచ్చినా మహిళ మిత్ర మరియు సఖి వన్ స్టాప్ సెంటర్ ని ఉపయోగించుకోవాలని కోరారు.  ఇబ్బందులు ఎదురైతే తానెప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చని సూచించారు.  ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు ,ఆకుల వీర్రాజు ,జక్కంపూడి విజయలక్ష్మి ,షర్మిల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా